ASR: అల్లూరి జిల్లాలో ఇప్పటివరకు 3,273 మంది రైతుల నుంచి 18,467 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లయ్స్ DM మోహనబాబు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 48 కేంద్రాల ద్వారా వార్షిక లక్ష్యంలో 54% సేకరణ పూర్తయింది. ఇందులో రంపచోడవరం, చింతూరు డివిజన్లలోనే అత్యధికంగా 15,432 టన్నులు సేకరించడం విశేషం అని అన్నారు.