కాకినాడ పర్యటనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ పోలీస్ గ్రౌండ్లో జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందుమాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, శాంతిభద్రతల పరిరక్షణపై ఆయన అధికారులతో కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో పరిపాలన, భద్రత విషయంలో తాము తీసుకుంటున్న పలు కీలక చర్యలను అధికారులు పవన్‌కు తెలిపారు.