ప్రకాశం: ఒంగోలు మండలంలోని పాతపాడు గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంఛార్జ్ సీఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్ బాషా, సిబ్బంది దాడులు నిర్వహించి రూ.12,320 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న నలుగురిని తాలూకా పోలీసులకు అప్పగించారు.