HNK: కాజీపేట రైల్వే స్టేడియంలో ఈనెల 11వ తేదీ నుంచి జాతీయస్థాయి సీనియర్ ఖో-ఖో పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఖో-ఖో పోటీలకు హాజరుకావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రాఘవరెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు. క్రీడారంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కడియం అన్నారు.