ELR: నూజివీడు మండలం మర్రిబంధంలో ఆదివారం రాత్రి జరిగిన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ సీఎం జగన్ ముఖచిత్రంతో ముద్రితమైన పాసుపుస్తకాన్ని చించివేశారు. వైసీపీ పాలనలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాన్ని భోగిమంటల్లో వేయాలని మంత్రి వ్యాఖ్యానించడంతో రైతులు హర్షద్వానం వ్యక్తం చేశారు.