తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రూ.70 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ కాలనీలో వాటర్ ప్లాంట్, మహిళా భవనం, శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణాలకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన విమర్శించారు.