KRNL: కొలిమిగుండ్ల మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ఆదాని పెన్నా సిమెంట్ పరిశ్రమలో డ్యూటీ ముగించుకుని వస్తున్న వారికి చిరుత పులి సంచారం కనిపించింది. గస్తీ తిరుగుతున్న సెక్యూరిటీకీ చిరుత పులి కనిపించింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.