నేషనల్ షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్‌పై వేటు పడింది. ఫరీదాబాద్‌లో 17 ఏళ్ల జూనియర్ మహిళా షూటర్‌పై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI), అంకుష్ను సస్పెండ్ చేసింది. అతని కేసు నమోదు కాగా, విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పిస్తున్నట్లు NRAI వెల్లడించింది.