MNCL: మంచిర్యాల సిమెంట్ కంపెనీ యాజమాన్యం మొండివైఖరి వీడి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు కోరారు. కంపెనీ ఎదుట కార్మికులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు ఇవాళ నాలుగో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీని మూసివేసి తమను తొలగించడంతో రోడ్డున పడ్డామని తెలిపారు. వెంటనే సర్వీస్ బెనిఫిట్స్ రూ. 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.