తిరుమలలో ఈ నెల 25న నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి రోజున ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు జరిగే నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు మాడవీధులలో షెడ్లు ఏర్పాటు చేసిదర్శన ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.