W.G: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం (M) ఎల్. అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెడు వ్యసనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, మద్యం ఇతర చెడు అలవాట్లకు లోనైతే జీవితాలు నాశనమవుతాయన్నారు. విద్యపై యువత దృష్టి సారించాలని సూచించారు.