ASF: ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు అండగా నిలిచేందుకు జిల్లా షీ టీమ్ బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. డిసెంబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా 50 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచామని, 12 అవగాహన సదస్సులు నిర్వహించామని వివరించారు. ఈవ్ టీజింగ్, వేధింపులకు గురయ్యే వారు భయం వీడి షీ టీమ్‌ను ఆశ్రయించాలని కోరారు.