MHBD: గంగారం, కొత్తగూడ అటవీ ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికల పై నిరంతర పర్యవేక్షణతో పాటు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పరిసర గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పెద్దపులి ఆనవాళ్లు అటవీ ప్రాంతంలోనే గుర్తించామని, నివాసాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.