VSP: బాల్య వివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. అల్లిపురం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్‌కు అడ్డంకి అని తెలిపారు.