MNCL: జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ప్రభుత్వ విద్యుత్ ఆస్తికి నష్టం కలిగించిన వారిపై ఫిర్యాదు అందిందని ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. ఆ గ్రామానికి చెందిన రైతులు జంగిలి కొమరయ్య, కొండయ్యల వ్యవసాయ భూములలో ఉన్న మూడు విద్యుత్ స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టినట్లు విద్యుత్ ఏఈ లచ్చన్న ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై పూర్తి విచారణ చేస్తామన్నారు.