GNTR: ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామంలో ఆర్ & బి రోడ్డు నుంచి వినాయకుని గుడి వరకు రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.