NZB: బషీరాబాద్‌కు చెందిన అంకడి రాజేందర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి రూ.1.10 లక్షల LOC మంజూరు చేయించారు. శుక్రవారం ఎమ్మెల్యే స్వయంగా బాధితుని కుటుంబ సభ్యులకు ఈ పత్రాన్ని అందజేశారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.