MDK: కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చంద్రం కృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కౌడిపల్లి శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సర్పంచుల మద్దతుతో ఆయనకు ఏకగ్రీవ విజయం సొంతమైంది. సమావేశంలో సర్పంచులు, నేతలు కౌడ శ్రీనివాస్ గుప్తా, కార్యకర్తలు పాల్గొన్నారు.