ప్రకాశం: కురిచేడు మండలం కల్లూరుకి చెందిన వైసీపీ నాయకుడు పల్లె ఏలియా తండ్రి పల్లె లింగయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి MLA డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెంటనే పార్టీ నాయకులను కల్లూరుకి పంపించారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించిన తర్వాత పూల మాలతో నివాళులర్పించారు. ఆయన మృతి బాధాకరమన్నారు.