TG: బీజేపీని అజేయమైన శక్తిగా మార్చడమే మనందరి లక్ష్యం కావాలని ఎంపీ ఈటల రాజేందర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన.. “రాజకీయాల్లో గెలవడమే అంతిమ గీటురాయి. గ్రూపు రాజకీయాలు ఎవరికీ బువ్వ పెట్టవు, పార్టీలో పరిపక్వతతో కలిసి పనిచేయాలి” అని సూచించారు