NGKL: జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న ఉదయం 9 గంటలకు నాగర్ కర్నూల్ పట్టణంలోని శోభ ఆప్టికల్స్లో ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నట్లు రిటైర్డ్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ శివారెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్, ఓటర్ లేదా రేషన్ కార్డు జిరాక్సులతో హాజరుకావాలని ఆయన కోరారు. వివరాలకు 9440454284కు సంప్రదించాలని సూచించారు.