CTR: పట్టపగలే వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన సోమలలో చోటుచేసుకుంది. బాధితురాలు రెడ్డమ్మ వివరాల మేరకు.. పిండి మిషన్‌కు వెళ్లేందుకు సాయిబాబా ఆలయం పక్కన ఉన్న దారిలో వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని 24 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది.