తూ.గో జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రిలోని రాష్ట్ర పేపర్ మిల్స్‌లో “పర్యావరణ పరిరక్షణ చట్టం 1986” పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాలుష్యం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. పర్యావరణ పరిరక్షణ చట్టంపై అందరికీ అవగాహన ఉండాలని సూచించారు.