MNCL: ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు రెవెన్యూ ఉద్యోగులు పనిచేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. కొత్త ఏడాది సందర్భంగా శుక్రవారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూభారతి, ఇతర రెవెన్యూ పథకాల అమలుకు కృషి చేయాలన్నారు.