MBNR: వ్యవసాయ పట్టాదారు పాస్ బుక్ కలిగిన రైతులందరూ వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గండీడ్ మండలం పెద్దవార్వాల్ ఏఈవో శివలీల తెలిపారు. ప్రభుత్వ పథకాలు నేరుగా పొందేందుకు అర్హులైన రైతులు లింక్డ్ మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్, పాస్ బుక్ పత్రాలతో మీ సేవలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.