PLD: కారంపూడి విద్యుత్ శాఖ నూతన ఏఈ (AE)గా ఓగూరి రమణయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వినుకొండలో సబ్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆయన, పదోన్నతిపై ఇక్కడికి బదిలీ అయ్యారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పలువురు నాయకులు, సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.