కర్ణాటక బళ్లారిలో హైటెన్షన్ కొనసాగుతోంది. బళ్లారి MLA భరత్ రెడ్డి, గంగావతి MLA గాలి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో నిన్న రాత్రి ఇరువర్గాల కాల్పులతో బళ్లారి దద్దరిల్లింది. భరత్ రెడ్డి అనుచరుల కాల్పుల నుంచి గాలి జనార్థన్ తప్పించుకోగా.. కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేసి.. భారీగా పోలీసులను మోహరించారు.