WGL: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెంపునకు కార్యక్రమం నిర్వహించారు. జనవరి 2 నుంచి 31 వరకు ‘మెడిటేషన్ సర్టిఫికేట్ కోర్సు’ ప్రారంభమవుతోందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించడమే కోర్సు ఉద్దేశ్యమని పేర్కొన్నారు.