ASR: హుకుంపేటలో 2020లో శంకుస్థాపన చేసిన రైతు సేవా కేంద్రం పనులు బిల్లుల జాప్యంతో గోడలకే పరిమితమయ్యాయి. దీనిపై ‘స్పందన’లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనం వృథాగా మారుతుండగా, వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.