KNR: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను శుక్రవారం బెజ్జంకి మండలం గుండారం గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు కీలక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి అవసరాలు, తదితర అంశాలపై గ్రామస్థులు ఆయనకు సమగ్రంగా వివరించారు.