PPM: సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో డీఆర్డిఏ (వెలుగు) సిబ్బంది ఫ్యామిలి ముస్తాబు పై అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం వెలుగు ఏపీఎం అంపల్లి జయమ్మ మహిళా సంఘాల సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఇల్లు ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలని, కూరగాయలు ఉప్పు నీటితో శుభ్రం చేసి వినియోగించాలన్నారు. అనంతరం ఇంటిలో వినియోగించే వస్తువులను శుభ్రం చేయించి ఎండలో పెట్టించారు.