తమిళ హీరో విజయ్ దళపతితో దర్శకుడు H. వినోద్ తెరకెక్కించిన సినిమా ‘జన నాయగన్’. ఈ మూవీ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ మూవీ తమిళ వెర్షన్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా ఇప్పటివరకు ఈ సినిమా రూ.15 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. విజయ్ చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.