W.G: భీమవరం మానవత శాఖ ఆధ్వర్యంలో భీమవరం జీఎంసీ బాలయోగి మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు స్నాక్స్, వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు భోజనాలు శుక్రవారం పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు మాట్లాడుతూ.. ఇండ్లలో జరిగే ప్రతీ కార్యక్రమం సేవా కార్యక్రమాలుగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల శర్మ, చాన్ భాషా, అల్లు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.