ATP: కూడేరు మండలంలోని పీఏబీఆర్ నుంచి ధర్మవరం కుడి కాలువకు 200 క్యూసెక్కుల నీటిని అధికారులు మళ్లించారు. ఇటీవల జల్లిపల్లి వద్ద కాలువ గట్టు కోతకు గురికాగా మిడ్పెన్నార్ డ్యాంకు 300 క్యూసెక్కుల నీటిని మళ్లించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలువ మరమ్మతు పనులు దాదాపు 90 శాతం పూర్తి కాగా నీటిని ధర్మవరం కుడి కాలువలోకి మళ్లించారు.