చైనాలో నిన్నటి నుంచి కండోమ్లు, గర్భనిరోధక మాత్రల ధరలు భారీగా పెరిగాయి. వీటిపై ప్రభుత్వం కొత్తగా 13% పన్ను విధించడమే ఇందుకు కారణం. తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా, జననాల రేటును పెంచేందుకే పరోక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024లో అక్కడ కేవలం 9.54 మిలియన్ల పిల్లలే పుట్టారు. వరుసగా మూడేళ్లుగా జనాభా తగ్గుతుండటంతో డ్రాగన్ దేశం ఆందోళనలో పడింది.