విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరిల ‘కింగ్డమ్’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. అయితే గతంలో ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చని నిర్మాత నాగవంశీ చెప్పాడు. అయితే తమ నిర్మాణ సంస్థలో గౌతమ్‌తో మాత్రం వేరే సినిమా ఉంటుందన్నాడు.