కర్ణాటక ఎమ్మెల్యే ఎస్. సురేష్ కుమార్ బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్రపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అనారోగ్య సమస్యలను జయించి ఆయన చూపిన దృఢ సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ యాత్ర ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అందరికీ గొప్ప సందేశాన్ని ఇస్తుందని, అందుకే స్వయంగా సురేష్ కుమార్తో మాట్లాడి అభినందించినట్లు మోదీ తెలిపారు.