CTR: పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం సమీపానగల శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా రేపు గరుడసేవ నిర్వహించనున్నట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి శుక్రవారం ఓ ప్రకటనలు తెలిపారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై ప్రత్యేకంగా అలంకరించి. పురవీధుల్లో ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు.