WGL: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువలకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు SE జగదీష్ తెలిపారు. యాసంగి పంటలకు 57.68 TMCల నీటిని కేటాయించగా,ప్రాజెక్టు దిగువన 7.56 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందనుంది. కాకతీయ కాలువ ద్వారా వారబంది ప్రకారం 8 రోజుల పాటు 5500 క్యూసెక్కుల నీటిని,7 రోజుల పాటు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగనుంది.