SRPT: హూజూర్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం 28 వార్డుల్లో మహిళా ఓటర్లు 15,731 మంది, పురుష ఓటర్లు 14,257 మంది, ఇతరులు 8 మంది ఉండగా మొత్తం 29,996 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,474 మంది అధికంగా ఉన్నారు. ఈనెల 5 న రాజకీయ పార్టీలతో సమావేశం 10న తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్నారు.