కోనసీమ: రాజోలులో గత నెల 29న ఆత్మహత్యకు పాల్పడిన యువతి అప్పన నాగప్రియ కేసులో గురువారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని రాజోలు సీఐ నరేష్కుమార్ తెలిపారు. తన మృతికి దారితీసిన కారణాలను వివరిస్తూ ఆమె లేఖ రాసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా దర్యాప్తు చేసి రాజోలుకు చెందిన డీ. బాపూజీ, కె. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.