PDPL: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 1,82,976 మంది ఓటర్లలో పురుషులు 91,395 కాగా, మహిళలు 91,551 మంది, ఇతరులు 30 మంది ఉన్నారు. ఇక్కడ స్త్రీ, పురుష ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండటం విశేషం. అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ జె. అరుణశ్రీ ఈ జాబితాను విడుదల చేశారు.