హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా కోర్టు సమర్థించింది. అధ్యక్షుడికి ఆ అధికారం ఉందని, చట్టాల ఉల్లంఘన జరగలేదని జడ్జి బెరిల్ హోవెల్ తీర్పునిచ్చారు. ఒబామా నియమించిన జడ్జి ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ తీర్పుపై అప్పీల్ కోర్టుకు వెళ్లాలని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించుకుంది.