WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల విభజన ప్రక్రియను బుధవారం వరంగల్ అడిషనల్ కలెక్టర్ జి. సంధ్యారాణి పరిశీలించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ సాగర్, మున్సిపల్ కమిషనర్ ఈ. సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.