యాదాద్రి: ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శించి ప్రజలు మన్ననలు పొందినప్పుడే గుర్తింపు ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం జరిగిన రామన్నపేట మండల డీఈ బోయ గాలయ్య పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని దంపతులను సత్కరించారు. డిపార్ట్మెంట్కు ఆయన అందించిన సేవలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా కొనియాడారు.