కోనసీమ: మండపేట తహసీల్దార్ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం ఆర్డీవో అర్ కృష్ణ నాయక్ బుదవారం సందర్శించారు. తహసీల్దార్ తేజేశ్వరరావు ఆయనకు స్వాగతం పలికారు. మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో విలీనం కావడం ఇక్కడి మూడు మండలాలు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండటంతో డివిజన్ అధికారిగా ఆయన కార్యాలయానికి చేరుకొని రికార్డులు పరిశీలించారు.