సత్యసాయి: కొత్తచెరువు మండలం బండ్లపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ నగదును అందజేశారు. జనవరి 1న సెలవు ఉన్నందున, ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని ఒకరోజు ముందుగానే పంపిణీ చేపట్టినట్లు ఆమె తెలిపారు.