W.G: తణుకు నియోజవర్గంలో 36,618 మంది లబ్ధి ప్రతి నెల రూ. 15.16 కోట్లు పెన్షన్లు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్ రాధాకృష్ణ తెలిపారు. బుధవారం అత్తిలి మండలం పాలిలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించి మాట్లాడారు. ఉదయం 8 గంటల నుంచి తొలి రోజు 99 శాతం పెన్షన్లు పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు పాల్గొన్నారు.