GNTR: తెనాలి రైస్ కాలనీలో ఇటీవల ఆంజనేయులు అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన జంగా గంగను వన్ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి భార్యతో ఆంజనేయులుకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఈ దాడి జరిగినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.