BPT: జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తూ, అలాగే అద్దంకిని నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నియోజకవర్గవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. బుధవారం అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి రవికుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.